కేటీఆర్! ఎగిరిపడకు... తరిమికొట్టకుంటే నాపేరు షబ్బీర్ అలీయే కాదు: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
- జానెడంత లేని కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం
- కాంగ్రెస్ ఏం పీకిందో మీ తండ్రిని అడగాలని కేటీఆర్‌కు సూచన
- కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని వ్యాఖ్య
- బీఆర్ఎస్‌కు 100 రోజులే మిగిలి ఉన్నాయన్న షబ్బీర్
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమన్న మాజీ మంత్రి
- ఎవరు వచ్చినా కామారెడ్డి తనదేనని ధీమా
కాంగ్రెస్ పీకిందేమీ లేదని కేటీఆర్ అంటున్నారని, కానీ మేం ఏం పీకామో మీ తండ్రి కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏం పీకారంటూ మీరు వాడుతున్న భాష తమకు రాదన్నారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ప్రతి ఐటీ కంపెనీ నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని షబ్బీర్ ఆరోపించారు. కేటీఆర్.. ఎగిరెగిరి పడకు. ఇంకా మీకు 100 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి తనదేనని, తాను గెలవడం పక్కా అన్నారు. తాను చెప్పకపోయినప్పటికీ ఇక్కడి ప్రజలు కేటీఆర్‌ను నిలదీశారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టకపోతే నా పేరు షబ్బీర్ అలీయే కాదన్నారు. కామారెడ్డికి తాను ఏం చేశానో కేసీఆర్‌ను అడిగితే చెబుతాడన్నారు. కౌన్సిల్‌లోనే తన గురించి కేసీఆర్ ఏం చెప్పారో కేటీఆర్ తెలుసుకొని మాట్లాడాలన్నారు.