డ్రగ్స్, అవినీతిపై పోరాడుదాం: బాలకృష్ణ
- డ్రగ్స్ , అవినీతి, అలసత్వం యువతను పీడిస్తున్నాయన్న బాలకృష్ణ
- తిండి గింజలు లేని స్థితి నుంచి చంద్రుడిపై స్వయంగా కాలుమోపే స్థాయికి ఎదిగామని వ్యాఖ్య
- బసవతారకం ఆసుపత్రిలో జెండా ఎగురవేసిన బాలయ్య
బసవతారకం ఆసుపత్రి గత 23 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోందని బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. దేశానికి ఎందరో మహనీయులు సేవలు అందించారని... వారిలో తన తండ్రి ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆయన స్థాపించిన బసవతారకం ఆసుపత్రి ఎంతో మంది క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలందిస్తోందని అన్నారు.