జీ 5 ఓటీటీ సెంటర్ కి హిందీ 'ఛత్రపతి'
- మే 12న విడుదలైన హిందీ 'ఛత్రపతి'
- వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ చేసిన సినిమా
- బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో లభించని ఆదరణ
- ఈ నెల 18 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
ఒక వైపున తెలుగులో ఫ్లాపులు ఎదుర్కుంటూ వచ్చిన ఆయన, ఆ సమయంలోనే హిందీ 'ఛత్రపతి'లో చేశాడు. తెలుగులో రాజమౌళి - కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా, అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఒక కంటెంట్ తోనే మే 12వ తేదీన బాలీవుడ్ కి బెల్లంకొండ పరిచయమయ్యాడు.
వినాయక్ కి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అయితే, ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 18వ తేదీ నుంచి ఓటీటీ సెంటర్లో స్ట్రీమింగ్ కానుంది. జీ 5వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.