చేయూతలో జగన్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు: గౌతు శిరీష

Gouthu Sireesha fires on Jagan
  • సున్నా వడ్డీ పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు జగన్ అసత్యాలు చెపుతున్నారన్న శిరీష
  • సంక్షేమం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ
  • స్త్రీనిధి పథకాన్ని నిలిపివేసింది జగనేనని ఆరోపణ
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శలు గుప్పించారు. సున్నా వడ్డీ పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు జగన్ అసత్యాలు చెపుతున్నారని అన్నారు. సున్నా వడ్డీ రాయితీని రూ. 3 లక్షలకు కుదించిన జగన్ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చేయూతలో జగన్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. 

నాలుగేళ్ల పాలనలో డ్వాక్రాను జగన్ నాశనం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. డ్వాక్రాను తీసుకొచ్చి, మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచింది చంద్రబాబేనని చెప్పారు. అభయ హస్తం నిధులను కాజేసి... స్త్రీనిధి పథకాన్ని నిలిపివేసింది జగనేనని ఆరోపించారు.
Go Back to Shorts
Gouthu Sireesha
Telugudesam
Jagan
YSRCP

More Telugu News