సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ శ్రీ రాపాక

RGV heroine Sri Rapaka bold comments on sex
  • పెళ్లికి ముందు శృంగారం గురించి శ్రీ రాపాక బోల్డ్ కామెంట్స్
  • శృంగారంలో పాల్గొంటేనే అతను మగాడా? కాదా? అనే విషయం తెలుస్తుందని వ్యాఖ్య
  • తన ఫ్రెండ్ కి జరిగిన అనుభవం గురించి చెప్పిన వైనం
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' సినిమాతో హీరోయిన్ శ్రీ రాపాక పాప్యులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా... అభిమానుల్లో క్రేజ్ మాత్రం అలాగే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు శృంగారం గురించి బోల్డ్ గా మాట్లాడింది. మ్యారేజ్ కి ముందు శృంగారంలో పాల్గొనడంలో తప్పులేదని... అందులో పాల్గొంటేనే అతను మగాడా? కాదా? అనే విషయం తెలుస్తుందని చెప్పింది. పెళ్లి జరిగిన తర్వాత అతను మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధ పడాల్సి వస్తుందని తెలిపింది. 

ఇదే సమయంలో తన స్నేహితురాలికి జరిగిన ఒక అనుభవం గురించి తెలిపింది. తన ఫ్రెండ్ తొలి రాత్రి... ఆమె భర్త ఒక గే అనే విషయం తెలిసిందని చెప్పింది. దీంతో, తన ఫ్రెండ్ ఎంతో బాధపడిందని తెలిపింది. శ్రీ రాపాక చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Sri Rapaka
Tollywood
Bold Comments

More Telugu News