మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కాంగ్రెస్ విజయమే: కవిత
- కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలు అన్న కవిత
- కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తమ పార్టీ విజయానికి కారణమవుతాయని వ్యాఖ్య
- ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం కోసమే విలీనమని స్పష్టీకరణ
సచివాలయ నిర్మాణంపై కాంగ్రెస్ వివాదాన్ని సృష్టించిందన్నారు. నేలమాళిగలు, గుప్త నిధుల కోసం సచివాలయం కడుతున్నామన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయంలోనూ ఆస్తుల కోసమంటూ గందరగోళం చేస్తున్నారన్నారు. రుణమాఫీ తమ ఎన్నికల ఎజెండా అని చెప్పారు. అలాంటి రుణమాఫీని కాంగ్రెస్ తమ విజయంగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం మాత్రం తప్పకుండా కాంగ్రెస్ విజయమే అని ఎద్దేవా చేశారు.