పాదయాత్రలో నారా లోకేశ్ చేతికి గాయం
- పల్నాడు జిల్లాలో లోకేశ్ యువగళం
- వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర
- లోకేశ్ తో కరచాలనం కోసం ఎగబడిన జనం
- చేతి వేలికి గాయం కావడంతో కట్టు కట్టుకుని పాదయాత్ర కొనసాగించిన లోకేశ్
దీనిపై తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. ఇదే గాయం జగన్ రెడ్డికి తగిలుంటే భారీ ఎత్తున డ్రామాలు జరిగుండేవని ఎద్దేవా చేసింది. ఆసుపత్రిలో చేరి చావుబతుకుల మధ్య ఉన్నట్టు బిల్డప్ లు, వీర లెవల్లో నటనలు ఉండేవని వ్యంగ్యం ప్రదర్శించింది. లోకేశ్ అసలేం జరగనట్టే పాదయాత్రను కొనసాగించారని టీడీపీ తన ట్వీట్ లో కొనియాడింది.