Telangana: టీ9-30 టిక్కెట్ తో 30 కి.మీ. ప్రయాణం.. టీఎస్ ఆర్టీసీ సరికొత్త పథకం

TSRTC t9 30 scheme for Palle Velugu bus
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల కోసం సరికొత్త రాయితీ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆర్టీసీ కొత్తగా టీ9-30 టిక్కెట్ ను ప్రవేశపెట్టింది. రూ.50 ఛార్జీతో పల్లె వెలుగులో టిక్కెట్ తీసుకొని 30 కిలో మీటర్లు రాను, పోను ప్రయాణించవచ్చు. ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ టీ9-30 టిక్కెట్ రేపటి నుండి అందుబాటులోకి వస్తోంది. 

దీంతో ఒక్కొక్కరికి రూ.10 నుండి రూ.30 వరకు ఆదా అవుతుంది. పల్లె వెలుగు కోసం ఈ టిక్కెట్ తీసుకున్న వారికి ఎక్స్‌ప్రెస్ లోను ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే రూ.20 కాంబినేషన్ టిక్కెట్ తీసుకొని ఎక్స్‌ప్రెస్ బస్సులోను ప్రయాణించవచ్చు. ఈ టిక్కెట్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్లు 040-69440000 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ టిక్కెట్ పల్లెవెలుగులో ప్రయాణించే అందరికీ వర్తిస్తుంది.
Go Back to Shorts
Telangana
rtc bus
tsrtc

More Telugu News