Botsa Satyanarayana: పవన్ కల్యాణ్... నీకు నిన్నటి క్లాస్ సరిపోయినట్టులేదు: బొత్స

Botsa continues Twitter war with Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య బైజూస్ కంటెంట్ విషయంలో ట్విట్టర్ వార్ నడుస్తోంది. పవన్ కు బొత్స 7 పాయింట్లతో ట్యూషన్ చెప్పగా, పవన్... 3 కీలక పాయింట్లు, 4 ప్రశ్నలతో బొత్సకు బదులిచ్చారు. 

తాజాగా, బొత్స మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. ప్రియమైన పవన్ కల్యాణ్... చూస్తుంటే నీకు నిన్నటి క్లాస్ సరిపోయినట్టు లేదు అని వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే ఇవాళ నీకు క్షేత్రస్థాయి నుంచి వాస్తవ పరిస్థితులను బోధిస్తాను అంటూ బొత్స వ్యాఖ్యానించారు. 

"పవన్... మరోసారి చెబుతున్నా, కాస్త హోం వర్క్ చేయవయ్యా. బైజూస్ కు సంబంధించి తాజా కథనాల్లో కనీసం ఒక్కటైనా చదువు... అందుకే ఈ కథనం పంపిస్తున్నా... ఇక్కడ్నించి మొదలుపెట్టు" అంటూ  ఓ మాస్టారిలా ఆదేశించారు. అంతేకాదు, తన ట్వీట్ కు 'ది ప్రింట్' లో వచ్చిన ఓ కథనాన్ని కూడా జోడించారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
Pawan Kalyan
Byjus
Twitter
YSRCP
Janasena

More Telugu News