ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్, ప్రభాస్ ఎంట్రీ అదుర్స్..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్, ప్రభాస్ ఎంట్రీ అదుర్స్..!

Project k first glimpse released
  • శాన్‌డియాగో కామిక్ కాన్‌లో ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ విడుదల 
  • కామిక్ కాన్‌కు హాజరైన చిత్ర బృందం
  • సినిమా టైటిల్‌గా ‘కల్కి 2898 ఏడీ’ గా ఖరారు, అదిరిపోయిన ప్రభాస్ లుక్స్ 
  • ప్రజలను అణచివేస్తున్న దుష్టశక్తిని ఎదిరించే పాత్రలో ప్రభాస్
  • సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసిన ఫస్ట్ గ్లింప్స్
సినీ అభిమానులు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ గ్లింప్స్ ఎట్టకేలకు వచ్చేసింది. ప్రభాస్ ఫస్ట్‌ లుక్‌పై వచ్చిన భిన్నాభిప్రాయాలకు ఒక్కసారిగా చెక్‌ పెట్టేసిందీ ఫస్ట్ గ్లింప్స్. అంతేకాకుండా.. మేకర్స్ ఈ మూవీ కల్కి 2898 ఏడీ టైటిల్‌ను ఖరారు చేశారు. 

శాన్‌డియాగో కామిక్ కాన్‌లో శుక్రవారం అర్ధరాత్రి చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ‘‘ప్రపంచాన్ని చీకటి చుట్టుముట్టినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది’’ అంటూ మొదలై.. వాటీజ్ ప్రాజెక్ట్ కే అనే డైలాగ్ తో ముగిసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ప్రభాస్ లుక్స్ అభిమానులతో కేక పెట్టిస్తున్నాయి. దుష్టశక్తుల చేతిలో సామాన్యుల అవస్థలు, వారిని రక్షించేందుకు ఉద్భవించిన శక్తిగా ప్రభాస్‌తో ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. సినిమాలో రాబోయే భారీ ఫైట్ సన్నివేశం తాలూకు చిన్న భాగాన్ని కూడా ఫస్ట్ గ్లింప్స్‌లో చూపించారు. దీపిక పదుకొణే ఇంట్రో కూడా ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. 

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్, ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటూ అగ్రనటులు అమితాబచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో విలన్‌గా నటిస్తున్న కమల్ హసన్ మాత్రం ఫస్ట్ గ్లింప్స్‌లో కనిపించలేదు. అద్భుతమైన యాక్షన్, సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. 
Advertisement
Project K Glimpse
Prabhas
Viral Videos

More Telugu News