సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
- ప్రమాణం చేసిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ
- 34కు గాను 32కి చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
- మదనపల్లెలో జన్మించిన జస్టిస్ ఎస్.వెంకటనారాయణ
తెలుగువారైన జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి 1962 మే 6న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పని చేసిన ఆయన 2019లో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది జూన్ 1 కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1964 ఆగస్టు 2న జన్మించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. గతేడాది జూన్ 29న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో ముంబై హైకోర్టు జడ్జిగా ఆయన సేవలందించారు.