Mithun Reddy: మదనపల్లిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని సీఐటీయూ నేతలు అడ్డుకున్నారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న అమ్మఒడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎంపీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద మిథున్ రెడ్డి రావడానికి ముందే సీఐటీయూ నేతలు నిరసనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మిథున్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి కాన్వాయ్ ముందుకు సాగింది.