ఫారెక్స్ ఉల్లంఘన కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీనా అంబానీ
- నిన్న అనిల్ అంబానీ, నేడు టీనా అంబానీ హాజరు
- ఫెమా చట్టంలోని పలు సెక్షన్ల కింద అనిల్ అంబానీపై కేసు
- ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ గతేడాది బాంబే హైకోర్టు ఆదేశాలు
యస్ బ్యాంక్ లోన్ కిక్‌బ్యాక్స్ కేసుకు సంబంధించి 2020లోనూ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే, ఆయన ఏ కేసులో నిన్న ఈడీ ఎదుట హాజరయ్యారన్నది తెలియాల్సి ఉంది. రూ. 420 కోట్ల పన్ను ఎగవేత కేసులో అనిల్ అంబానీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ గతేడాది సెప్టెంబరులో బాంబే హైకోర్టు ఆదేశించింది.