ఓటీటీలోకి ఆదిపురుష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసే యోచన
- త్వరలో అధికారికంగా ప్రకటించనున్న నిర్మాతలు
- ఈ నెల 16న థియేటర్లలో విడుదలైన ప్రభాస్ మూవీ
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.