ఓలా నుంచి త్వరలోనే మరో కొత్త స్కూటర్
- జులైలో విడుదల చేయనున్న సంస్థ
- రెండువైపులా హ్యాండిల్ గ్రిప్పర్స్ వద్ద ఎల్ఈడీ లైట్స్
- ఇంటర్నల్ కంబస్టన్ తరానికి ముగింపు అంటూ ఓలా క్యాప్షన్
‘‘ఈ జులైలోనే మీ స్క్రీన్లపై రాబోతున్నాం. చూస్తూనే ఉండండి’’ అంటూ ట్వీట్ పెట్టింది. స్కూటర్ కి హెడ్ లైట్ మాత్రమే కాకుండా, హ్యాండిల్ కుడి, ఎడమ ముందు భాగంలోనూ లైట్లతో ఈ స్కూటర్ చూడ్డానికి కొత్తగా కనిపిస్తోంది. ‘‘ఇంటర్నల్ కంబస్టన్ తరానికి ముగింపు. భారత ఎలక్ట్రిక్ రంగానికి సూర్యోదం’’ అంటూ క్యాప్షన్లు పెట్టింది. చూడబోతుంటే ఇందులో కొత్త ఫీచర్లు, ఆకర్షణలు తప్పకుండా ఉంటాయని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఓలా మరింత వాటాను గెలుచుకునే వ్యూహంతో కనిపిస్తోంది.