ధోనీ నిర్మాతగా 'LGM' చిత్రం... రిలీజ్ కు రెడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ నిర్మాతగా 'LGM' చిత్రం... రిలీజ్ కు రెడీ

Dhoni produces LGM Movie on his own banner
  • నిర్మాతగా మారిన టీమిండియా మాజీ సారథి ధోనీ
  • ధోనీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై LGM చిత్రం
  • రమేష్ తమిళ్ మణి దర్శకత్వం
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న LGM
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై 'LGM ' సినిమాను రూపొందిస్తున్నారు. 

తమిళంలో హరీశ్ కల్యాణ్, ఇవానా జంటగా, నదియా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ధోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు. 

చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను, ఆడియో విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ధోనీ, సాక్షి దంపతులు హాజరుకానున్నారు.

కాగా, చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం అని వెల్లడించారు. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుందని, LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. 

కాగా, ఇటీవ‌ల విడుదలైన LGM టీజర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న LGM చిత్రానికి ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు మ్యూజిక్‌ను కూడా అందించారు. యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.
Advertisement
MS Dhoni
LGM
Dhoni Entertainment Banner
Movie

More Telugu News