హనుమాన్ సీట్లో కూర్చున్న వ్యక్తిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి
- ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఓ సీటు కేటాయింపు
- భ్రమరాంబ థియేటర్ లో హనుమాన్ సీట్లో కూర్చున్న వ్యక్తిపై దాడి
- ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ నెటిజన్
ఆదిపురుష్ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్‌లలో హనుమంతుడి కోసం ఒక్కో సీటును ఖాళీగా విడిచిపెడుతున్నారు. ఆ సీటుపై కాషాయం వస్త్రం కప్పి, సీట్లో పూలు, పండ్లు పెట్టి ఉంచుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్‌లో కూడా హనుమంతుడి కోసం ఒక సీటును విడిచిపెట్టారు.
అయితే ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. అతనిని చూసిన ప్రభాస్ అభిమానులు అక్కడకు వచ్చి అతనిని సీట్లో నుండి లేవమని చెప్పారు. ఈ సందర్భంగా వాదన జరిగింది. కాసేపటికి అతనిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రేక్షకుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.