Adipurush: 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శనలలో హనుమంతుడికి ఓ సీటు రిజర్వ్!

  • ప్రతీ థియేటర్లో ఓ సీటును రిజర్వ్ చేస్తామన్న నిర్మాతలు
  • రామ భక్తుల నమ్మకాన్ని గౌరవించేందుకేనని ప్రకటన
  • ఈ నెల 16న తెలుగు సహా ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల
Adipurush team to dedicate 1 seat in every theatre to Lord Hanuman

రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడికి ఆంజనేయుడు వస్తాడని హిందువుల నమ్మకం.. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది. సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్ లో ఓ సీటును అమ్మకుండా ఉంచేస్తామంటూ ఆదిపురుష్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో, సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెత్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు తిరుపతిలో నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News