Bellamkonda Srinivas: హరీశ్ శంకర్ క్లాప్ తో రంగంలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్!

  • నిరాశపరిచిన 'ఛత్రపతి' రీమేక్ ఫలితం 
  • బెల్లంకొండ శ్రీనివాస్ కి పెరిగిన గ్యాప్ 
  • సాగర్ కె చంద్ర దర్శకత్వంలో కొత్త సినిమా 
  • ఈ రోజునే పట్టాలెక్కిన ప్రాజెక్టు
Bellamkonda Srinivas in Sagar K Chandra movie

బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. అయితే ఆ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టడం వలన .. ఆ ప్రాజెక్టు ఎక్కువ కాలం పాటు సెట్స్ పై ఉండటం వలన ఆయనకి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది.  'ఛత్రపతి' హిందీ ఫలితాన్ని చూసిన తరువాత మాత్రం ఇక ఆయన ఆలస్యం చేయదలచుకోలేదు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అనుకున్న సినిమాను ఆయన పట్టాలెక్కించాడు. ఈ సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలను  జరుపుకుంది. హరీశ్ శంకర్ క్లాప్ తో .. పరశురామ్ స్క్రిప్ట్ అందించడంతో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది.రామ్ ఆచంట - గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'భీమ్లా నాయక్' తరువాత సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న సినిమా ఇది. రీమేక్ గా చేసిన 'రాక్షసుడు' మినహా అంతకుముందు ... ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ కి హిట్ అనేది పడలేదు. ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News