అమెరికాలో భారత సంతతి యువకుడి దారుణ హత్య
- ఫిలడెల్ఫియా నగరంలో ఆదివారం వెలుగు చూసిన ఘటన
- ఉద్యోగం నుంచి తిరిగొస్తున్న జూడ్ చాకోపై(21) దోపిడీకి యత్నం
- నిందితులు కాల్పులు జరపడంతో యువకుడి దుర్మరణం
జూడ్ తల్లిదండ్రులు కేరళ వాస్తవ్యులు. 30 ఏళ్ల క్రితం వారు అమెరికాకు వలస వెళ్లారు. విద్యార్థి అయిన జూడ్ స్థానికంగా పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు. మరోవైపు, ఈ ఘటనతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఓహాయోలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయీశ్ వీరాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో అతడు మరణించాడు.