భర్తకు విడాకులు ఇచ్చి మరో మహిళను పెళ్లాడింది!
- పశ్చిమబెంగాల్ లో మహిళల స్వలింగ వివాహం
- నిన్న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న మహిళలు
- వీరిలో ఒకరికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వైనం
ఈ సందర్భంగా మౌమిత మాట్లాడుతూ... ప్రేమ అనేది స్త్రీ, పురుషుల మధ్యే కాకుండా ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషుల మధ్య కూడా చిగురిస్తుందని అన్నారు. మౌసుమిని వివాహం చేసుకోవడం తన కుటుంబానికి ఇష్టం లేదని... అందుకే తన ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని తెలిపారు. మౌసుమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని చెప్పారు. మరోవైపు మౌసుమి మాట్లాడుతూ... తన భర్త రోజూ తనను చిత్రహింసలకు గురి చేసేవాడని, అందుకే ఆయన నుంచి విడిపోయానని తెలిపారు.