అందుబాటు ధరకే సూపర్ డిజైన్ తో మోటోరాలా ఎడ్జ్ 40

Motorola Edge 40 launched under Rs 30000 reasons to buy
ప్రముఖ కంపెనీ మోటరోలా చక్కని డిజైన్ తో మధ్య స్థాయి రేటుతో ‘మోటరోలా ఎడ్జ్ 40’ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.29,999. ఫ్లిప్ కార్ట్ పై ఇది అందుబాటులో ఉంటుంది. ప్రీ ఆర్డర్ చేసుకునేందుకు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ అనుమతిస్తోంది. మే 30లోపు ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికి ఏడాది వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ సదుపాయం ఉంది. పాత ఫోన్ ఎక్సేంజ్ పై అదనంగా రూ.2,000 బోనస్ ఇస్తారు. 

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఐపీ 68 రేటింగ్ ఉంది. నీళ్లలో పడినప్పటికీ దెబ్బతినదు. 6.55 అంగుళాల కర్వ్ డ్ ఫుల్ హెచ్ డీ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏర్పాటు చేశారు. ఇది 5జీ స్మార్ట్ ఫోన్. పలుచగా 7.4 ఎంఎం మందంతో ఉంటుంది. 

వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫేస్ అన్ లాక్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ లో ఒక్కటే నానో సిమ్ ఉంటుంది. మరొకటి ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ చార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. బాక్స్ తో పాటు చార్జింగ్ అడాప్టర్ వస్తుంది.
Go Back to Shorts
Motorola Edge 40
launched
Rs 29999
flipkart

More Telugu News