YS Vijayamma: కర్నూలు ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ

Vijayamma visits Kurnool Avinash Reddy mother
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ గత కొన్నిరోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ఇవాళ బులెటిన్ విడుదల చేశాయి. కాగా, విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. 

లక్ష్మమ్మ కుటుంబ సభ్యులతోనూ, డాక్టర్లతోనూ మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి తల్లి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.
Go Back to Shorts
YS Vijayamma
YS Avinash Reddy
Mother
Lakshmamma
Viswabharati Hospital
Kurnool
YSRCP
Andhra Pradesh

More Telugu News