మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం!
- ఇటీవలే పార్టీలో చేరిన అభ్యర్థి
- అంబేలోహల్ పంచాయతీ వార్డు సభ్యుడిగా విజయం
- తెలంగాణకు ఆవల తొలి గెలుపు
ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఉప ఎన్నిక జరగ్గా నిన్న ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.