Pavan Kalyan: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

  • హరీశ్ శంకర్ రూపొందిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
  • పవన్ కల్యాణ్ తో చేస్తున్న రెండో సినిమా
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న పవన్  
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్  
Ustaad Bhagath Sungh Glimse Released

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన, అనుకున్నదానికంటే చాలా ఆలస్యంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. 

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ .. పత్తర్ గంజ్ .. పాతబస్తీకి చెందిన పోలీస్ ఆఫీసర్ గా పవన్ ఈ సినిమాలో కనిపించనున్నాడనే విషయం ఈ గ్లింప్స్ వలన తెలుస్తోంది. 42 సెకన్ల నిడివిలోనే పోలీస్ ఆఫీసర్ గా పవన్ తన మార్క్ .. తన స్టైల్ చూపించాడు. ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని పవన్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం విశేషం.    

హరీశ్ శంకర్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. ఇక పవన్ కల్యాణ్ కి గల మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనుంది.

More Telugu News