హీరో ప్రభాస్ అజాత శత్రువు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో ప్రభాస్ అజాత శత్రువు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

BJP leader Vishnu Vardhan Reddy terms Prabhas  a good man
  • ప్రభాస్ శ్రీరాముడిగా ఆదిపురుష్ చిత్రం
  • తాజాగా ట్రైలర్ రిలీజ్
  • ఇదొక అద్భుతమైన సినిమా అన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • రాజకీయకోణంలో చూస్తున్నారని వెల్లడి
అగ్రహీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆదిపురుష్. ఈ పాన్ ఇండియా చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో, బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. నటుడు ప్రభాస్ అజాత శత్రువు అని కొనియాడారు. అద్భుతమైన సినిమాను రాజకీయ కోణంలో చూస్తూ, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జై శ్రీరామ్ అంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. దేవదత్త నాగె హనుమంతుడి పాత్ర పోషించారు.
Advertisement
Vishnu Vardhan Reddy
Prabhas
Adipurush
Kriti Sanan
Om Raut
Pan India

More Telugu News