'వాహ్ ఉస్తాద్' అనిపించేలా పవన్ పోస్టర్.. ఫస్ట్ గ్లింప్స్‌పై మరింత ఉత్కంఠ
- ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ పోస్టర్ విడుదల
- హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా
- ఈ సాయంత్రం 4.59 గంటలకు రానున్న ఫస్ట్ గ్లింప్స్
కళ్ల జోడు పెట్టుకొని, బ్యారికేడ్ పై చేయి ఉంచిన పవన్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఫొటో అదిరిపోయింది. ఆయన వెనకాల చాలా మంది ముస్లింలు ఉన్నారు. క్లాస్, మాస్, స్వాగ్ అన్నీ కలగలిసినట్టుగా ఉన్న ఫొటో అదిరిపోయేలా ఉంది. స్టయిల్, స్వాగ్‌తో కూడిన సేవియర్ (రక్షకుడు) అంటూ చిత్ర బృందం దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.