ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి.. రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక!
- ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
- నదిలో స్నానాలు, చేపల వేట వద్దని ప్రజలకు సూచన
- సుంకేసుల డ్యామ్‌కు భారీగా వరద.. సాయంత్రానికి పూర్తిస్థాయికి నీటిమట్టం
గోదావరి నది ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నాటికి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని, ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద పరిస్థితిని ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.
గోదావరి పరీవాహక ప్రాంతాలైన పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానాలకు వెళ్లడం, చేపల వేట వంటి పనులు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు చేరిన రహదారులపై ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుంకేసుల డ్యామ్‌కు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఈ సాయంత్రానికి డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యమైన 1.2 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. మరో వారం రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాలో గత నాలుగు రోజుల్లో సగటున 33.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.