'మరువ తరమా' నుంచి ఫస్ట్ సాంగ్ .. యూత్ మనసు దోచేస్తున్న మెలోడీ!
Add ap7am to your home Screen

'మరువ తరమా' నుంచి ఫస్ట్ సాంగ్ .. యూత్ మనసు దోచేస్తున్న మెలోడీ!

Maruva Tharama Lyrical song released
  • ప్రేమకథా చిత్రంగా 'మరువ తరమా'
  • నూతన నటీనటులతో సాగే సినిమా 
  • దర్శకుడిగా చైతన్య వర్మ పరిచయం 
  • ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్   
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మరింతగా ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా చిన్న సినిమాలలో ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ తరహా కథల పట్లనే యూత్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రేమకథ ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. ఆ సినిమా పేరే 'మరువ తరమా'.
 
ఈ సినిమాతో అద్వైత్ ధనుంజయ .. అతుల్య చంద్ర .. అవంతిక నల్వా హీరో .. హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. రమణమూర్తి - విజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, చైతన్య వర్మ దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'పాదం పరుగులు తీసే .. ప్రాణం ఉరకలు వేసే .. పరువం పరిచిన ఆశే .. ప్రాయం పదమని తోసే' అంటూ ఈ పాట సాగుతోంది.

 విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ పాటకి చైతన్య వర్మ సాహిత్యాన్ని అందించగా, రోహిత్ ఆలపించాడు. హీరో .. హీరోయిన్స్ పై చిత్రీకరించిన ఈ పాటకి, యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీగా మార్కులు కొట్టేస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Advertisement
Advaith Dhanunjay
Athulya Chandra
Avanthika Nalva

More Telugu News