Shaakuntalam: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'శాకుంతలం'

  • గత నెల 14న విడుదలైన 'శాకుంతలం'
  • డిజాస్టర్ గా నిలిచిన సమంత చిత్రం
  • ఈ నెల 12 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్
Shaakuntalam OTT date

సమంత ప్రధాన పాత్ర పోషించిన 'శాకుంతలం' మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చినప్పటికీ... విడుదలైన తర్వాత తీవ్ర నిరాశను మిగిల్చింది. తన కెరీర్ లోనే ఈ సినిమా ఒక పెద్ద ఫెయిల్యూర్ అని నిర్మాత దిల్ రాజు కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 14న విడుదలైన ఈ చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ నెల 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

More Telugu News