సినీ నటి సమంత యాడ్‌పై సానియా మీర్జా ఏమన్నారంటే..!

Sania Mirza Heaps Praise On Samantha
  • అమ్మాయి తనకు నచ్చినట్లు జీవించాలనే ఉద్దేశ్యం యాడ్ ద్వారా చూపించే యత్నం
  • సమంతను ప్రశంసిస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టిన టెన్నిస్ తార సానియా మీర్జా
  • తన టెన్నిస్ ఆట జ్ఞాపకాలను నెమరువేసుకున్న క్రీడాకారిణి
సినీ నటి సమంత ఇటీవలి ఓ వాణిజ్య ప్రకటనపై టెన్నిస్ తార సానియా మీర్జా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళలు వేసుకునే దుస్తులు, భాగస్వామి ఎంపిక.. ఇలా అన్ని అంశాల్లో అమ్మాయిలపై అభిప్రాయం రుద్దే ప్రయత్నం చేస్తారు. దీనిని దాటుకొని ఓ అమ్మాయి తనకు నచ్చినట్లుగా జీవించాలనే ఉద్దేశ్యం ఈ యాడ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై సానియా మీర్జా స్పందించారు.

ఈ యాడ్ చూశాక తనను ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయని, ఓ మహిళ టెన్నిస్ లో ఏం సాధిస్తుందని, తాను ఎంత వరకు వెళ్లగలను అంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కానీ తాను మాత్రం నా కల ప్రకారం ముందుకు సాగానని, సమాజం అభిప్రాయాలను పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో నడిచినట్లు చెప్పారు. నా సంకల్పం ముందు వారి మాటలు చిన్నబోయాయన్నారు. కలలను సాకారం చేసుకోవాలనే మహిళలకు ఈ యాడ్ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు.
Go Back to Shorts
Samantha
Sania Mirza
ad

More Telugu News