జవాను అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కేటీఆర్
- జమ్మూ కశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన అనిల్ మృతి
- 11 ఏళ్లుగా ఆర్మీలో టెక్నీషియన్ గా పని చేస్తున్న అనిల్
- తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఎంపీ బండి సంజయ్
జవాన్ అనిల్ మృతి పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమన్న కేటీఆర్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాను మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ .. అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడారు. అనిల్ అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.