అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హేళన చేసిన ట్రంప్.. వీడియో వైరల్!

Donald Trump Mocks Stumbling Rival Joe Biden
  • బైడెన్‌ను అనుకరిస్తూ ట్రంప్ హేళన
  • ప్రసంగం మర్చిపోయినట్టు, ఎటువెళ్లాలో తెలీక తికమక పడ్డట్టు నటించిన ట్రంప్
  • నెట్టింట వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆయన రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ న్యూహాంప్‌షైర్‌లో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బైడెన్‌ను అనుకరిస్తూ హేళన చేశారు. ప్రసంగం మధ్యలో బైడెన్‌లా మాట్లాడాల్సింది మర్చిపోయినట్టు నటించారు. ఆ తరువాత స్టేజీ దిగేందుకు ఎటు వెళ్లాలో తెలీక తికమక పడ్డట్టు నటిస్తూ తన మద్దతుదారులను నవ్వించారు. చివరకు ఎడమవైపు చేయి చూపిస్తూ అటు వైపు మెల్లగా అడుగులోఅడుగు వేసుకుంటూ ట్రంప్ నడవడం బైడెన్‌ను గుర్తుకుతెచ్చింది. దీంతో, సభలో ఆయన మద్దతుదారులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. 

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రెండు రోజులకే ట్రంప్ ఆయనను హేళన చేసేలా అనుకరించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్‌ను పలు న్యాయపరమైన సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఆయన రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించదలిచారు. ఈ మారు బైడెన్‌పై ట్రంప్ పూర్తి ఆధిక్యత కనబరుస్తారని ఆయన అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ట్రంప్‌ సభకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Advertisement
Donald Trump
Joe Biden

More Telugu News