Karumuri Nageswar Rao: త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కారుమూరి

Chandrababu will go to jail says Karumuri
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జరుపుకున్నది 420 బర్త్ డే అని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. తానే ఇంద్రుడు, చంద్రుడు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని గతంలో ప్రచారం చేశారని.. బాబు వచ్చాడు కానీ, జాబు రాలేదని అన్నారు. 

తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అని మండిడ్డారు. సొంత తమ్ముడిని గదిలో బంధించిన సైకో, శాడిస్ట్ చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తున్నాయని.... త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. మైకు కూడా పట్టుకోలేని స్థితికి చంద్రబాబు వచ్చారని... ఆయనను జనాలు శాశ్వతంగా ఇంటికి పంపే సమయం ఆసన్నమయిందని అన్నారు. సెప్టెంబర్ లో విశాఖకు వెళ్లడం ఖాయమని, అక్కడి నుంచి పాలన జరుగుతుందని చెప్పారు. ఏపీ రాజధాని వైజాగేనని అన్నారు.
Go Back to Shorts
Karumuri Nageswar Rao
YSRCP
chandrababu
Telugudesam

More Telugu News