Nani: నాని 30వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!

  • షూటింగు దశలో నాని 30వ సినిమా
  • పరిశీలనలో 'హాయ్ నాన్న' టైటిల్ 
  • తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ
  • నాని సరసన నాయికగా మృణాళ్ ఠాకూర్ 
  • డిసెంబర్ 21వ తేదీన సినిమా విడుదల
Nani 30 th movie update

నాని హీరోగా ఇటీవల వచ్చిన 'దసరా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది. మాస్ హీరోగా కూడా నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని, ఆ తరువాత సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. 

కెరియర్ పరంగా నానీకి ఇది 30వ సినిమా. తల్లిదండ్రులు విడిపోవడం వలన పిల్లలు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తారనేది కథ. తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రధానంగా ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అందువలన ఈ సినిమాకి 'హాయ్ నాన్న' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు అదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు.

 వైరా బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని భార్య పాత్రలో మృణాళ్ ఠాకూర్ కనిపించనుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News