Uttar Pradesh: 3 ఏళ్ల బాలికపై 10 ఏళ్ల బాలుడి అత్యాచారం!

10 year old boy allegedly rapes 3 year old girl in up
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 10 ఏళ్ల బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

శనివారం తమ కూతురిని ఆ బాలుడు స్కూల్ భవంతిపైకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఒకటవ తరగతి చదువుతుండగా బాలిక కిండర్‌గార్టెన్‌లో ఉంది.
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News