పాకిస్థాన్ లో బతకడం, జైల్లో ఉండటం రెండూ ఒకటే: కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్
- పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పై డౌల్ విమర్శలు
- డౌల్ బస చేసిన హోటల్ ఎదుట బాబర్ అభిమానులు
- భయంతో తినడానికి కూడా బయటకు వెళ్లేవాడిని కాదన్న డౌల్
దీంతో, డౌల్ కు బాబర్ అభిమానుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన బస చేసిన హోటల్ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండేవారు. దీంతో, తాను భయంతో కనీసం తినేందుకు కూడా బయటకు వెళ్లేవాడిని కాదని డౌల్ చెప్పాడు. కొన్ని రోజులు తిండి లేకుండా బాధ పడ్డానని తెలిపాడు. ఎంతో మానసిక హింసకు గురయ్యానని చెప్పాడు. పాకిస్థాన్ లో జీవించడం కంటే జైల్లో ఉండటమే బెటర్ అని అన్నాడు. గతంలో జరిగిన ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.