KTR: సెల్ఫీకి రూ. 500 ఇవ్వండి.. కేటీఆర్ సరదా వ్యాఖ్య

KTR funnily asks rs 500 for a selfie as youth throng to take selfies with leader
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పర్యటనలు చేపట్టిన ప్రతిసారీ యువతీయువకులు సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. ఇక కేటీఆర్ కూడా అడిగిన వారికి కాదనకుండా అభిమానులు, కార్యకర్తలతో ఫొటోలు దిగుతుంటారు. 

తాజాగా కేటీఆర్..రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే.. అడిగిన వారిని కాదనకుండా మంత్రి ఫొటోలకు పోజులిచ్చారు. కానీ.. అభిమానుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో సెల్ఫీలకు రూ.500 ఖర్చవుతుందంటూ సరదాగా కామెంట్ చేశారు. అయితే.. కేటీఆర్‌ను చూసిన సంతోషంలో ఉన్న అభిమానులు మంత్రి కామెంట్స్‌ను పక్కన పెట్టేసి తమదారిన తాము సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Go Back to Shorts
KTR

More Telugu News