Samantha: ఆసక్తిని రేపుతున్న 'శాకుంతలం' ట్రైలర్!

  • శకుంతలగా కనిపించనున్న సమంత 
  • కథలోని ముఖ్యమైన అంశాలపై కట్ చేసిన ట్రైలర్ 
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న అద్భుతమైన చిత్రీకరణ 
  • ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు  
Shaakuntalam trailer relesed

శకుంతల పాత్రను పోషించే అవకాశం కోసం చాలా మంది కథానాయికలు కలలు కంటూ ఉంటారు. ఆ పాత్రను పోషించే అవకాశం రావడమే అదృష్టమని భావిస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకూ అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వచ్చింది. అలాంటి కథానాయికల జాబితాలోకి సమంత చేరిపోయింది. 

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మణిశర్మ స్వరపరిచిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

శకుంతల - దుష్యంతుల మధ్య పరిచయం .. ప్రేమ .. వివాహం .. విరహం .. వియోగం .. శకుంతల గర్భాన్ని ధరించడం వంటి అంశాలను టచ్ చేస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ సినిమాను మలిచారనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది.

More Telugu News