ట్రంప్ పై పరువునష్టం దావా.. పోర్న్ స్టార్ కు చుక్కెదురు
Add ap7am to your home Screen

ట్రంప్ పై పరువునష్టం దావా.. పోర్న్ స్టార్ కు చుక్కెదురు

Stormy Daniels Ordered To Pay Trump Legal Fees After Losing Defamation Case
  • కేసు కొట్టేసిన కాలిఫోర్నియా న్యాయస్థానం
  • లీగల్ ఖర్చుల కింద ట్రంప్ కు 1.2 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశాలు
  • ట్రంప్ తో తన బంధంపై నోరు మెదపవద్దంటూ బెదిరింపులు వచ్చాయన్న డేనియల్స్
  • అదంతా కట్టుకథ అన్న ట్రంప్ వ్యాఖ్యలపై దావా వేసిన పోర్న్ స్టార్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వల్ప ఊరట లభించింది. కోర్టు కేసులు, నేరాభియోగాలు, అరెస్టులతో సతమతమవుతున్న ట్రంప్ ఓ తీర్పుతో కాస్త ఉపశమనం పొందారు. పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ వేసిన పరువు నష్టం దావాను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో లీగల్ ఖర్చుల కింద 1,21,000 డాలర్ల (సుమారు రూ.కోటి) ను ట్రంప్ కు చెల్లించాలని డేనియల్స్ ను ఆదేశించింది. ఈమేరకు కాలిఫోర్నియా కోర్టు బుధవారం డేనియల్స్ దాఖలు చేసిన పరువునష్టం దావాను తోసిపుచ్చింది. ఈ కేసుతో పాటు మరో కేసుకు సంబంధించి 5 లక్షల డాలర్లను ట్రంప్ కు  డేనియల్స్ చెల్లించాల్సి ఉంది. 

డేనియల్స్ వేసిన దావా ఏంటంటే..
డొనాల్డ్ ట్రంప్ తనతో సన్నిహితంగా మెలిగారని, ఆ బంధం గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లు ముట్టజెప్పాడని స్టోర్మీ డేనియల్స్ ఆరోపించింది. 2018లో తమ బంధం గురించి బయటపెట్టడంతో తనకు బెదిరింపులు వచ్చాయని డేనియల్స్ పేర్కొంది. ఈ విషయంలో నోరు మెదప వద్దని ఓ వ్యక్తి తనను బెదిరించాడని డేనియల్స్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. డేనియల్స్ మాటలను కట్టుకథలుగా విమర్శించాడు. ఈ కామెంట్లపై మండిపడ్డ డేనియల్స్.. ట్రంప్ పై పరువునష్టం దావా వేసింది. తాజాగా ఈ దావాను కాలిఫోర్నియా కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ట్రంప్ కు అయిన లీగల్ ఖర్చులు భరించాలని డేనియల్స్ ను ఆదేశించింది.
Advertisement
Donald Trump
america
USA
porn star
stormy daniels

More Telugu News