Kiran Abbavaram: అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'మీటర్' సాంగ్ రిలీజ్!

Meter movie lyrical song released
షార్ట్స్‌లో చూడండి
కిరణ్ అబ్బవరం పెద్దగా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా విజయవంతమైంది. ఆ సక్సెస్ ను మరిచిపోకముందే ఆయన మరో సినిమాను థియేటర్లకి తీసుకుని వచ్చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'మీటర్'. 

మైత్రీ - క్లాప్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును వదిలారు. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ' ఓ బేబీ జారిపోమాకే' అంటూ ఈ పాట సాగుతోంది.

సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకి బాలాజీ సాహిత్యాన్ని అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. ఈ సినిమాతో కథానాయికగా అతుల్య రవి పరిచయమవుతోంది. 2017లో కథానాయికగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి, తెలుగులో ఇదే ఫస్టు మూవీ. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Go Back to Shorts
Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News