'నాటు నాటు' పాటకు టెస్లా కార్ల లైటింగ్ అదిరిపోయింది... వైరల్ వీడియో ఇదిగో!
- ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నాటు నాటు పాట
- ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు
- ఇప్పటికీ తగ్గని మేనియా
- అమెరికాలో నాటు నాటు పాటకు లయబద్ధంగా లైటింగ్ షో
- వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం
తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం ఆవిష్కృతమైంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరిపోతూ వెలుగుతూ లయబద్ధంగా చేసిన ఆ లైటింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.