Kiran Abbavaram: ' మీటర్' నుంచి మరో మాస్ బీట్ .. సాంగ్ ప్రోమో రిలీజ్!

Meter song promo released
షార్ట్స్‌లో చూడండి
యువ కథానాయకుడిగా కిరణ్ అబ్బవరం తన దూకుడు చూపిస్తూ వెళుతున్నాడు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మీటర్' రెడీ అవుతోంది. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రమేశ్ దర్శకత్వంలో మైత్రీ - క్లాప్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించారు. 

 ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. జోరుగా .. హుషారుగా మాస్ బీట్ తో సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకునేదిలా ఉంది.    

  ఈ నెల 15వ తేదీన పూర్తి పాటను వదలనున్నారు. ఈ సినిమాతో కథానాయికగా 'అతుల్య రవి' పరిచయం కానుంది. 'వినరో భాగ్యము విష్ణుకథ' తరువాత చేస్తున్న ఈ సినిమాపై కూడా కిరణ్ బలమైన నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముస్తాబవుతూ ఉండగానే, మరో సినిమాను ఇటీవలే ఆయన పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.

Go Back to Shorts
Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News