సినిమాల్లో బఫూన్ గా నటిస్తే డబ్బులైనా వస్తాయి: రఘురామపై మార్గాని భరత్ వ్యాఖ్యలు
- రఘురామపై ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీ
- రఘురామ ఓ అరిటాకు అంటూ వ్యాఖ్యలు
- గూగుల్ లో అరిటాకు అని కొడితే రఘురామ గురించే వస్తుందని వ్యంగ్యం
నియోజకవర్గం సరే... ఏపీలోనూ, కనీసం హైదరాబాదులోనూ అడుగుపెట్టలేని అజ్ఞాతవాసి అని అభివర్ణించారు. గూగుల్ సెర్చ్ లో అరిటాకు అని వెదికితే రఘురామ గురించే వస్తుందని, ఆయనొక కమెడియన్ అని ఎద్దేవా చేశారు.
రఘురామ ఏవైనా సినిమాల్లో నటిస్తే కనీసం డబ్బులు అయినా వస్తాయని హితవు పలికారు. రఘురామకు పెద్దగా మేకప్ కూడా వేయాల్సిన అవసరం లేదని, మామూలుగానే బఫూన్ లాగా ఉంటాడని వ్యంగ్యం ప్రదర్శించారు. మహాభారతంలో శిఖండికి, ఆయనకు పెద్ద తేడా లేదని అన్నారు.