rana naidu: ‘రానా నాయుడు’ను కుటుంబంతో చూడొద్దు: రానా

rana apologies to those who hate rana naidu
షార్ట్స్‌లో చూడండి
బాబాయ్ వెంకటేశ్.. అబ్బాయ్ రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెటిఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. అయితే ‘రానా నాయుడు’కి ఎంత మంచి టాక్ వస్తోందో.. అంతే నెగటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తోంది. అశ్లీలత ఎక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో వచ్చే కామెంట్లపై రానా దగ్గుబాటి స్పందిస్తున్నారు. 

రానా నాయుడు సిరీస్ ను విమర్శిస్తున్న, అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణలు చెబుతున్నాను. ఇదే సమయంలో తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు ఉదయం నుంచి ఆయన పలు ట్వీట్లు చేశారు. ఈ వెబ్ సిరీస్ ను కుటుంబంతో కలిసి చూడొద్దని ఆయన కోరారు. ‘ఏ’ రేటెడ్ సినిమా అని, 18 ప్లస్ వయసు వారికేనని పేర్కొన్నారు. ఒంటరిగానే చూడాలని ఆయన కోరడం గమనార్హం.

నిజానికి స్ట్రీమింగ్ కు ముందే ఈ సిరీస్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు వెంకటేశ్. ప్రీమియర్ షో సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘‘మీ ఇంట్లో ల్యాప్‌ ట్యాప్ లు, ఫోన్లలో దీన్ని చూస్తుంటే మీ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు పూర్తిగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఇందులో కామెడీ, హింస, సెక్స్ కూడా ఉన్నాయి’’ అని చెప్పారు. ‘కానీ మరీ ఇంతనా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మితిమీరిన అసభ్య పదజాలం, శ‌ృంగార సన్నివేశాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.
Go Back to Shorts
rana naidu
Rana Daggubati
Venkatesh Daggubati
web series
rana apologies

More Telugu News