సమంత రాకతో ‘ఖుషీ’ సినిమా సెట్లో సంబరాలు

Grand Welcome For Samantha On kushi Sets
  • కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన చిత్ర బృందం
  • మహిళా దినోత్సవం సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు
  • పరిశ్రమలోకి వచ్చి 13 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
సమంతా రుతు ప్రభు పూర్తిగా కోలుకుంది. విజయ్ దేవరకొండతో కలసి చేస్తున్న ‘ఖుషీ’ సినిమా సెట్లోకి అడుగు పెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ బృందం సమంతకు ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా సమంత కేక్ కట్ చేసింది. విజయ్ దేవరకొండ సహా అక్కడున్న తోటి కళాకారుల నోరు తీపి చేసింది.

సరిగ్గా మహిళా దినోత్సవం రోజున బుధవారం ఇది చోటు చేసుకుంది. మహిళా దినోత్సవంతోపాటు, సమంత పరిశ్రమలోకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండతోపాటు, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆద్యంతం సమంత హుషారుగా కనిపించింది.

కొన్ని నెలల క్రితం తాను మయోసైటిస్ అనే వ్యాధికి లోనైనట్టు సమంత ప్రకటించడం తెలిసిందే. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. శరీరమంతా కండరాల నొప్పులు వేధిస్తుంటాయి. దీంతో ఆమె నటనకు విరామం తీసుకుంది. ఫలితంగా ఖుషీ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. చికిత్సతో సమంతా పూర్తిగా కోలుకుంది. జిమ్ లో వర్కవుట్ వీడియోలు కూడా విడుదల చేస్తుండడం తెలిసిందే.
Go Back to Shorts
Samantha
kushi MOVIE
SETS
CAKE CUTTING
WOMENS DAY

More Telugu News