దిల్ రాజు గారి నుంచి కాల్ రాగానే కంగారు పడిపోయాను: ప్రియదర్శి

Priyadasrhi Interview
  • ప్రియదర్శి హీరోగా వచ్చిన 'బలగం'
  • తొలిరోజున థియేటర్ల దగ్గర పల్చగా కనిపించిన జనం 
  • ఆ తరువాత మౌత్ టాక్ తో పెరుగుతూ పోయిన తీరు 
  • దిల్ రాజు గారు చెప్పినట్టే జరిగిందన్న ప్రియదర్శి 
ప్రియదర్శి కమెడియన్ గా చేస్తూనే, అడపా దడపా హీరోగాను తెరపై కనిపిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'బలగం' మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ .. "ఒక రోజున దిల్ రాజు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే నేను కంగారు పడిపోయాను .. ఆశ్చర్యపోయాను" అన్నాడు. 

"వేణు వచ్చి ఒక కథను వినిపిస్తాడు .. విన్న తరువాత కాల్ చేయ్ దర్శి" అని ఆయన అన్నారు. వేణు వచ్చి కథ చెబుతుంటేనే నాకు కన్నీళ్లు వచ్చాయి. దిల్ రాజుగారికి కాల్ చేసి .. ఆ సినిమా చేస్తానని చెప్పాను. షెడ్యూల్ .. షెడ్యూల్ కి ఈ సినిమాపై నమ్మకం పెరుగుతూ పోయింది. డబ్బింగ్ దగ్గరికి వచ్చేసరికి పూర్తినమ్మకం వచ్చేసింది" అని చెప్పాడు. 

"అయితే ఈ సినిమా విడుదలైన రోజున వసూళ్లు అంతగా లేవు. మేము వెళ్లిన థియేటర్ కూడా సగం మాత్రమే నిండింది. నేను .. వేణు చాలా డల్ అయ్యాము. 'మనం మంచి సినిమా తీశాము .. జనాలు థియేటర్స్ కి రావడానికి రెండు రోజులు టైమ్ పడుతుంది' అని దిల్ రాజు గారు ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు. 

Advertisement
Priyadarshi
Kavya
Venu
Balagam Movie

More Telugu News