‘కేజీఎఫ్’ను గుర్తుతెచ్చేలా ‘కబ్జా’ ట్రైలర్!

upendra kiccha sudeep kabzaa trailer out
  • ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటించిన ‘కబ్జా’
  • 1945లో జరిగిన కథగా చిత్రాన్ని రూపొందించిన మేకర్స్
  • ఆకట్టుకుంటున్న ట్రైలర్.. కేజీఎఫ్ మాదిరే డార్క్ థీమ్.. మ్యూజిక్.. యాక్షన్స్ సీన్స్.. డైలాగ్స్..!
  • కీలక పాత్రలో నటించిన శివరాజ్ కుమార్!
కేజీఎఫ్, కాంతారా సినిమాల తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు మరో సెన్షేషనల్ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విలక్షణ నటుడు ఉపేంద్ర, మరో హీరో కిచ్చా సుదీప్ కలిసి నటించిన ‘కబ్జా’ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 

స్వతంత్రం రావడానికి ముందు 1945లో జరిగిన కథగా ఈ చిత్రాన్ని మలిచారు. విజువల్స్ అన్నీ కేజీఎఫ్ సినిమా తరహాలో ఉన్నాయి. డార్క్ థీమ్.. మ్యూజిక్.. యాక్షన్స్ సీన్స్.. డైలాగ్స్.. ఎలివేషన్స్.. మరో కేజీఎఫ్ ను గుర్తు చేస్తున్నాయి. 

‘‘చరిత్ర ఎప్పుడూ తెగిపడిన తలల కంటే.. ఆ తలల్ని తీసిన చేతులనే పొగుడుతుంది. అలాంటి ఒక చేయి సృష్టించిన కథే కబ్జా’.. ‘‘ఓ సామ్రాజ్య నిర్మాణం.. నరికే కత్తితో కాదు. ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం’’.. ‘‘ఇఫ్ యు వాంట్ టు ప్లే మి.. ఐ విల్ ప్లే ద గేమ్.. ఇఫ్ యు వాంట్ టు కిల్ మి.. ఐ విల్ ఎండ్ ది గేమ్ (నువ్వు నాతో ఆడాలి అనుకుంటే.. నేను ఆట ఆడతా.. అదే నువ్వు నన్ను చంపాలి అనుకుంటే.. ఆటని ముగిస్తా)’.. వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. 

యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ఆర్.చంద్రు తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తుండటం మరో విశేషం. ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. కథ వేరేమో కానీ.. టేకింగ్ మాత్రం కేజీఎఫ్ లానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


కబ్జా ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Go Back to Shorts
upendra
kiccha sudeep
kabzaa trailer out
shivaraj kumar
KGF

More Telugu News