తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడులు... కేటీఆర్ హర్షం
- సీఎం కేసీఆర్ తో ఫాక్స్ కాన్ బృందం భేటీ
- పరిశ్రమల ఏర్పాటుకు ఫాక్స్ కాన్ ఆసక్తి
- లక్ష మందికి ఉపాధి కలుగుతుందన్న కేటీఆర్
కేటీఆర్ ఇటీవల ఢిల్లీలో ఫాక్స్ కాన్ చైర్మన్ తో భేటీ అయ్యారు. తెలంగాణకు రావాలంటూ ఆహ్వానించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను, రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కేటీఆర్ ఆయనకు వివరించారు.
కేటీఆర్ ఆహ్వానంపై యంగ్ ల్యూ ఇవాళ తన బృందంతో హైదరాబాద్ విచ్చేశారు. ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందంతో సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా పాల్గొన్నారు.