Samantha: ‘యాక్షన్ ఫలితం’.. షూటింగ్ లో గాయపడ్డ సమంత!

Samantha Ruth Prabhu get injured on Citadel sets
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. సినీ ఇండస్ట్రీలో తన 13 ఏళ్ల జర్నీని రెండు రోజుల కిందటే పూర్తి చేసుకుంది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడిన ఆమె.. దాన్నుంచి కోలుకుని వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. త్వరలోనే శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది.

తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. ‘సిటాడెల్’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో తను గాయపడింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో దెబ్బలు తగిలించుకుంది. రెండు చేతులకు గాయాలైన విషయాన్ని సమంత తెలిపింది.

ఈ మేరకు సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. రెండు చేతుల ఫొటో పెట్టి.. ‘యాక్షన్ ఫలితం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా.. గాయాలు మాత్రం తప్పలేదు.

‘సిటాడెల్’ సినిమాలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ - డికే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తీస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌కి ఇది భారతీయ వర్షన్. ఒరిజినల్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడ్డెన్, స్టాన్లీ టుస్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Go Back to Shorts
Samantha
Citadel
Varun Dhawan
Raj and DK
russo brothers
samantha injured

More Telugu News